
2026 ఫిబ్రవరి-మే మధ్య వివిధ దేశాల్లోని 42,000 మందిపై ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ నిర్వహించిన సర్వేలో 36 దేశాల ప్రజలు భారత్ పట్ల ప్రేమతో ఉన్నారు. శ్రీలంకలో 2024లో 65%గా ఉన్న సానుకూలత ఇప్పుడు 79%కి పెరిగి టాప్ లో ఉంది. 2022లో ఆ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డప్పుడు మనం రూ.50 వేల కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించడంతో అక్కడి ప్రజలు భారతదేశాన్ని అత్యంత మిత్ర దేశంగా చూస్తున్నారు. యూకే(71), కెన్యా(71), జర్మనీ(63), ఇజ్రాయెల్(60), ఇటలీ(56), జపాన్(55), థాయిలాండ్(55), స్వీడన్(55), సింగపూర్(51), కెనడా(51), ఫ్రాన్స్(50), ఘనా(50), ఫిలిప్పీన్స్(49), నైజీరియా(47), పాక్(7) శాతంతో ఉన్నాయి.