
ఏపీ పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చిలకలూరిపేట వద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఆటోలోని ఏడుగురు మృతిచెందగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న బస్సు ప్రకాశం జిల్లా కొండమంజులూరు నుంచి వేలూరు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. గాయపడ్డవారిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న ఆటోను బస్సు వేగంగా ఢీకొట్టింది.