
క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అతడి ఎదుగుదల, అభివృద్ధిపై సునిశిత దృష్టిసారించగా, నిలకడైన విజయాలకు సిద్ధంగా ఉండాలని బోర్డ్ కార్యదర్శి దేవజిత్ సైకియా సూచించాడు. “సచిన్ వంటి దిగ్గజాల బాటలో నడిచేలా సుదీర్ఘ కెరీర్ నిర్మించుకోవాలి.. మేం వైభవ్ ను సీరియస్ గా చూస్తున్నాం.. కెరీర్లో వేసే ప్రతి అడుగు, కోణాన్ని గమనిస్తున్నాం.. దేశానికి సేవ చేస్తూనే ఉండాలి..” అని బోర్డు స్పష్టం చేసింది.
పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోవడం, ఇంగ్లండ్ పర్యటనలో 5 టీ20ల సిరీస్ ను 0-4తో చేజార్చుకోగా, వన్డే సిరీస్ లోనూ ఓటమి తప్పలేదు. దీంతో జట్టు ఆటతీరుతోపాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పనితీరుపైనా సమీక్ష చేసింది. ఈ సమీక్షకు గంభీర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ తోపాటు వన్డే కెప్టెన్ శుభ్ మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాజరయ్యారు. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అగార్కర్ అందుబాటులో లేకపోవడంతో భేటీకి రాలేదు.