
బాల్య వివాహాలు, గర్భాలను గుర్తించేందుకు ఇల్లిల్లూ తనిఖీ చేయాలని పశ్చిమ బెంగాల్(West Bengal) సీఎం సువేందు అధికారి ఆదేశించారు. జనవరి 1 నుంచి జూన్ 30 మధ్య 60 వేల మంది మైనర్ బాలికలకు ప్రసవాలైనట్లు ఆరోగ్య శాఖ నివేదించడంతో తనిఖీలకు ఆదేశాలిచ్చారు. ముర్షిదాబాద్ జిల్లాలో 12,847, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 4,178 డెలివరీలైనట్లు అధికారులు సీఎంకు తెలిపారు.ఈ రెండు జిల్లాలూ మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆధిపత్య జిల్లాలే కావడం విశేషం. బాల్య వివాహాలు, ప్రెగ్నెన్సీల విషయంలో దేశంలోనే బెంగాల్ అగ్రస్థానంలో ఉంది. వీటిలో ప్రమేయమున్న వ్యక్తుల్ని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. వాళ్లను జైళ్లలోనే ఉంచాల్సిన అవసరముందని సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.