
హ్యాట్రిక్ సాధించాలన్న బెలారస్ క్రీడాకారిణి ఎరీనా సబలెంకా ఆశలు తుడిచేస్తూ ఎలెనా రిబకినా(కజకిస్థాన్) సంచలనం సృష్టించింది. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ఏస్ లు సంధిస్తూ 6-4, 5-7, 6-2 తేడాతో యూఎస్ ఓపెన్ తొలి కిరీటాన్ని ముద్దాడింది. వరల్డ్ నంబర్ 2 రిబకినా చేతిలో ఓడిన ప్రపంచ నంబర్ 1 సబలెంకా తీవ్ర నిరాశతో కుంగిపోయి ఆగ్రహంతో రాకెట్ ను పగులగొట్టింది. ఈ గెలుపుతో రిబకినా ఇక ప్రపంచ నంబర్ వన్ కానుంది.
ఆమె మరో రికార్డును సొంతం చేసుకుంది. 31 ఏళ్ల నాటి రికార్డును సమం చేసింది. 1995లో స్టెఫీగ్రాఫ్ తర్వాత ఒకే సంవత్సరంలో రెండు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో నంబర్ వన్ క్రీడాకారిణిని ఓడించిన మొదటి మహిళా ప్లేయర్ గా నిలిచింది. 21వ శతాబ్దంలోనే ఈ ఘనత అందుకున్న తొలి క్రీడాకారిణిగా నిలిచింది. ఎరీనా సబలెంకాను ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఓడించగా, ఇప్పుడు మరోసారి దాన్ని రిపీట్ చేసింది.