‘జర హట్ కే జర బచ్ కే’ మూవీతో అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న నటి సారా అలీఖాన్. అందులోని సాంగ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా సారాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2018లో ‘కేదార్ నాథ్’ సినిమాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ఈ నటీమణి.. తొలి పిక్చర్ తోనే క్రేజ్ కొట్టేసింది. ‘కేదార్ నాథ్’ మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించగా.. ‘బెస్ట్ ఫిమేల్ డెబ్యుట్’గా సారా అలీఖాన్ ‘ఫిల్మ్ ఫేర్’ అవార్డును దక్కించుకున్నారు.
చేసింది ఐదారు సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ కొట్టేసిన సారాకు ముంబయి ఎయిర్ పోర్టులో వింత అనుభవం ఎదురైంది. ఫ్లైట్ దిగి కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంగా అభిమానులు, ఫొటోగ్రాఫర్లు ఆమెను పలకరించారు. ఒకరిద్దరితో ఆమె మాట్లాడుతుండగానే ఒక్కసారిగా ఎక్కువ సంఖ్యలో ఆమెను చుట్టుముట్టేందుకు ట్రై చేశారు. దీన్ని గమనించిన పర్సనల్ సిబ్బంది హింట్ ఇవ్వడంతో.. ఆమె పరుగులు పెట్టారు. రన్ చేస్తూనే కారు వద్దకు చేరుకుని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.