పవన్ కల్యాణ్ పై ఆయన మాజీ భార్య చేసిన కామెంట్స్ పై AP మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘అమ్మా రేణూ… మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లతో శునకానందం పొందొద్దని’ అంటూ ప్రకటన చేశారు. ఇప్పటికే పవన్, అంబటి రాంబాబు మధ్య వాగ్వాదం నడుస్తున్నది. ‘బ్రో’ మూవీలో శ్యాంబాబు పాత్ర తనను ఉద్దేశించి తయారు చేసిందేనంటూ అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. అటు పవన్ సైతం దీటుగా స్పందించారు. దీనిపై AP మంత్రుల్లో అత్యధికులు జనసేనానిపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అంబటి మాత్రం ఆయన పర్సనల్ లైఫ్ పై తీవ్రమైన కామెంట్స్ చేశారు.
ఇన్నాళ్లూ పెద్దగా రెస్పాండ్ కాని రేణు దేశాయ్ గురువారం ఇన్ స్టాగ్రామ్(Instagram) వేదికగా స్పందించారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరియర్(Career) పై పాజిటివ్ కామెంట్స్ చేశారు.