గ్రూప్-2 పరీక్ష కొద్దిరోజులు వాయిదా వేయాలంటూ పట్టుబడుతున్న అభ్యర్థులు.. మరోసారి ఆందోళన బాట పడుతున్నారు. ఈ నెల 10న TSPSC కార్యాలయాన్ని పెద్దసంఖ్యలో ముట్టడించిన అభ్యర్థులు.. కోర్టులో కేసు కూడా వేశారు. ఈరోజు మరోసారి ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద దీక్ష చేసేందుకు OU విద్యార్థులు రెడీ అయ్యారు. అయితే ముందస్తుగా పోలీసులు అందరినీ అరెస్టు చేస్తున్నారు. ఆగస్టులో విపరీతమైన షెడ్యూల్స్ ఉన్నందున గ్రూప్-2 రాసే వీలు లేదంటూ అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన వేలాది మంది అభ్యర్థులతో TSPSC ఆఫీసును ముట్టడించి భారీయెత్తున ఆందోళన నిర్వహించారు. TSPSC పట్టించుకోకపోవడంతో చివరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గ్రూప్-2 వాయిదాపై వేసిన పిటిషన్ మీద ఈనెల 11న హైకోర్టులో విచారణ నడిచింది. దీనిపై TSPSC న్యాయవాది వచ్చే సోమవారం వరకు గడువు కోరారు. కానీ ఇప్పటికే ఎగ్జామ్స్ సెంటర్స్ ని అందుబాటులో ఉంచామని కోర్టుకు PP తెలిపారు. అయితే గడువు అడగడంతో కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.