Published 01 DEC 2023
బుధవారం అర్థరాత్రి మొదలైన తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఘర్షణ మరింత పెరుగుతూనే ఉంది. నాగార్జునసాగర్(Nagarjuna Sagar) డ్యామ్(Project) పై ఇరు రాష్ట్రాలు భారీగా పహారా పెట్టాయి. అటు AP వైపున పెద్దయెత్తున బలగాలు డ్యామ్ పైకి చేరుకోవడంతో.. ఇక్కడి పోలీసులు సైతం పెద్దసంఖ్యలో అక్కడకు వస్తున్నారు. IG స్థాయి అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అటువైపు నిన్నటి నుంచి వాటర్ రిలీజ్ కొనసాగుతుండగా.. ఇప్పటికే కుడి కాల్వ నుంచి 4,000 క్యూసెక్కుల్ని పొరుగు రాష్ట్రం విడుదల చేసుకుంది. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 522 అడుగులు కాగా.. మరో 12 అడుగులకు తగ్గితే డెడ్ స్టోరేజీగా పరిగణిస్తారు.
జరిగింది ఇదీ..
నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యత రెండు రాష్ట్రాలది. కుడి కాల్వ మొత్తం APకి, ఎడమ కాల్వ తెలంగాణకు కేటాయించారు. మొన్న 10 రోజుల పాటు ఎడమ కాల్వ ద్వారా తెలంగాణకు నీటి విడుదల చేసి ఆపేశారు. కేటాయింపుల్లో భాగంగా తమకూ నీరు కావాలంటూ AP మొన్న అర్థరాత్రి డ్యామ్ పైకి చేరుకుంది. తెలంగాణ వైపు గేట్ దూకిన భద్రతా సిబ్బంది.. మనవాళ్ల ఫోన్లు లాక్కుని గందరగోళం సృష్టించారు. 26 గేట్లలో 13వ గేట్ వద్దకు చేరుకుని మీది సగం మాది సగం అంటూ ఫెన్సింగ్ వేసుకున్నారు. నిన్నంతా పోలింగ్ ఉండటంతో ఇటువైపు అధికారులు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో గురువారం ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా ఈరోజు కూడా దాన్ని కంటిన్యూ చేసే విధంగా మరిన్ని బలగాల్ని AP దింపితే.. తెలంగాణ వైపు నుంచి సైతం భారీగా బలగాలు చేరుకుంటున్నాయి.