అపాయింట్ మెంట్ కోసం MLAలే కాదు.. KCR, KTR, హరీశ్ రావు అడిగినా టైమ్ ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చెప్పేదేంటి.. నేను వినేదేంటి అంటూ విమర్శలు చేశారు. డిప్యుటీ CM భట్టి విక్రమార్కతో కలిసి గాంధీభవన్ లో మాట్లాడిన రేవంత్… కేసీఆర్ తోపాటు మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో భారత్ రాష్ట్ర సమితి(BRS) చచ్చిపోయిందంటూ తీవ్ర కామెంట్స్ చేసిన CM.. ఆ పార్టీని ప్రజలు పూడ్చేశారన్నారు.
ఎప్పుడైనా కలవొచ్చు…
ప్రజా సమస్యల కోసం తనను ఎప్పుడైనా కలవొచ్చని చెప్పిన రేవంత్… MLAలకు ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా సమయం కేటాయిస్తానని గుర్తు చేశారు. శాసనసభ(Assembly)లో తీర్మానం చేసిన తర్వాతే BC జనగణన చేస్తామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువస్తామని క్లారిటీ ఇచ్చారు.
Published 30 Jan 2024