6 Warning Signs Of Diabetes : డయాబెటిస్ అనేది వయస్సుతో సంబంధం లేదు. ఏ వయస్సువారిలోనైనా వచ్చే ప్రమాదం ఉండగా ఇందుకు అనేక కారణాలున్నాయి. అందులో జీవనశైలి, ఆహారపు అలవాట్లు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే అది జీవితకాలం వేధించే సమస్య. దీర్ఘకాలం మందులు వాడుతూనే ఉండాలని అంటారు. తీవ్రత ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా ప్రతిరోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. డయాబెటిస్ ఎలా వస్తుందంటే.. శరీరంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడం. తద్వారా అధిక స్థాయిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఉండిపోతాయి. అలా రక్తంలో పేరుకుపోయిన చక్కెర నిల్వలు క్రమంగా అవయవాలపై దాడి చేస్తాయి. తద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. చాలామందికి కాళ్లలో మధుమేహ సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి. మధుమేహం-సంబంధిత కాలు సమస్యల లక్షణాలను గుర్తించి అర్థం చేసుకోవడం చాలా కీలకమని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. మధుమేహం వచ్చిందనడానికి కాళ్లల్లో కనిపించే 6 హెచ్చరిక సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. జలదరింపు :
ఆరోగ్యనిపుణుల ప్రకారం డయాబెటిస్ వల్ల నరాలు దెబ్బతింటాయి. కాళ్లలో పెరిఫెరల్ న్యూరోపతికి దారితీస్తుంది. జలదరింపు, తిమ్మిరి, మంటలు, అనుభూతిని కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. బాధితులు తమ పాదాలపై గాయాలు లేదా పుండ్లను తొందరగా గుర్తించలేరు. చర్మం మొద్దుబారిపోయి నొప్పి తెలియకుండా పోతుంది. ఫలితంగా అంటువ్యాధులు, అల్సర్లకు దారితీస్తుంది.
2. రక్త ప్రసరణ తగినంత లేకపోవడం :
అధిక రక్త చక్కెర స్థాయిలు రక్త నాళాలను దెబ్బతీస్తాయి. కాళ్లలో రక్త ప్రసరణ సరిగా జరగదు. కాలు తిమ్మిర్లు, నొప్పి, బలహీనత, నెమ్మదిగా మానడం వంటి లక్షణాలు ఉన్నాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే..పీఏడీ (PAD) గ్యాంగ్రీన్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అవసరమైతే అంతవరకు కాళ్లను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
3. డయాబెటిక్ ఫుట్ అల్సర్లు :
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. న్యూరోపతి, రక్తప్రసరణ సరిగా లేకపోవడం వంటివి పాదాల అల్సర్లకు దారితీయవచ్చు. ఈ అల్సర్లు నెమ్మదిగా ఇన్ఫెక్షన్లకు గురై పుండ్లుగా ఏర్పడుతాయి. ఈ అల్సర్లతో కలిగే తీవ్రమైన అనారోగ్యాన్ని నివారించడానికి గాయం వెంటనే నయం అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు తగినంత సంరక్షణ అవసరమని గమనించాలి.
4. ఎరుపు లేదా వాపు :
డయాబెటిక్ ఫుట్ డిఫోర్మిటీ (వైకల్యం) అని కూడా పిలుస్తారు. ఈ పరిస్థితి బలహీనమైన ఎముకలు(Bones), కీళ్లు దెబ్బతినడం వల్ల పాదాల(Foot)లో పగుళ్లు వస్తాయి. పాదం లేదా చీలమండలో ఎరుపు, వాపు, వైకల్యం వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.
5. చర్మంలో మార్పులు :
డయాబెటిస్ వల్ల చర్మం పొడిబారడం(Dry), పగుళ్లు ఏర్పడటం, ఫంగల్ లేదా బ్యాక్టీరియల్(Bacterial) ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని
వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మంలో ఉన్నట్టుండి ఏమైనా అసహజ రీతిలో మార్పులు కనిపిస్తే అది డయాబెటిస్ అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
6. రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ (RLS) :
మధుమేహం ఉన్నవారిలో ఎక్కువ మందికి ఈ ఆర్ఎల్ఎస్ (RLS) రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ సమస్య ఉన్నట్టుగా అనేక అధ్యయనాల్లో తేలింది. డయాబెటిస్‌కు దీనికి కచ్చితమైన సంబంధం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆర్ఎల్ఎస్ ఉన్న బాధితులు తమ కాళ్ళలో అసౌకర్య అనుభూతులను అనుభవిస్తారు. తరచుగా అటు ఇటు కదిలినప్పుడు కొద్దిగా ఉపశమనం పొందుతారు. మధుమేహం ఉన్న వ్యక్తులు వారి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. సాధారణ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. వైద్యులు సూచించిన విధంగా మందులు లేదా ఇన్సులిన్ తీసుకోవడం చాలా అవసరం. రొటీన్ ఫుట్ కేర్, హెల్త్‌కేర్(Health Care) ప్రొఫెషనల్‌తో రెగ్యులర్ చెక్-అప్లు చేయించుకోవాలి.
తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించాలి :
మధుమేహం వచ్చిందన్న సందేహం కలిగినపుడు ఎట్టిపరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయరాదు. మధుమేహం-సంబంధిత లెగ్ కాంప్లికేషన్లతో ఉన్న లక్షణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వెంటనే మీకు దగ్గరలోని డయాబెటిస్ నిపుణుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. మీకు డయాబెటిస్ వచ్చిందని నిర్ధారణ అయిన వెంటనే అవసరమైన చికిత్స తీసుకోవడం మొదలుపెట్టాలి. అలానే నిర్ణక్ష్యం చేస్తే మరిన్ని అనారోగ్య సమస్యలు తల్తెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు(Health Experts) హెచ్చరిస్తున్నారు.
Published 03 Feb 2024