కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం తెలివిలేదని, అది ఉంటే కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులను KRMB(Krishna River Management Board)కు అప్పగించేవారు కాదని మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఇది ఒక రకంగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనన్న ఆయన.. ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ తాము తగ్గబోమన్నారు. కృష్ణానది ప్రాజెక్టుల విషయంలో దక్షిణ తెలంగాణ లీడర్లతో సమావేశమైన KCR.. మళ్లీ పోరాటం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. BRSకు పోరాటం కొత్త కాదన్న మాజీ CM.. KRMBలోకి ప్రాజెక్టులు వెళ్తే ప్రమాదకరమన్నారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించకూడదనేదే తమ సిద్ధాంతమని గుర్తు చేశారు.
అక్కణ్నుంచే పోరాటం..
ఇక తమ పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చిన KCR.. నల్గొండలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా మనమేంటో నిరూపిద్దాం అని ఆ పార్టీ లీడర్లతో అన్నారు. ఈ నెల 13న నిర్వహించే సభ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
Published 06 Feb 2024