దేశంలో యూపీఐ(UPI) సేవలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ చిన్న నగదు(Net) బదిలీ చేసుకోవాలన్నా UPI కీలకంగా మారిపోయింది. పర్సు లేకున్నా ఫోన్ ఉంటే చాలు అన్న పరిస్థితి తయారైంది. గంటలో వేల కోట్ల నగదు బదిలీ జరిగే యూపీఐ సేవలు నిలిచిపోతే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు అదే తీరు ఎదురైంది. నాలుగైదు గంటల నుంచి నగదు బదిలీ జరగక.. యూజర్లు తిప్పలు పడుతూనే ఉన్నారు.
సర్వర్లు డౌన్…
UPI(Unified Payments Interface) సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు(Users) ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. UPI సర్వీసులకు అనుసంధానంగా ఉండే బ్యాంకుల్లో సర్వర్లు డౌన్ కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఫోన్ పే, గూగుల్ పే, భీమ్, పేటీఎంతో ట్రాన్జాక్షన్స్ జరిపే అవకాశం లేకుండా పోయింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇదే పరిస్థితి కంటిన్యూ అయింది.
బ్యాంకు సేవలూ స్టాప్…
యూపీఐ లావాదేవీ(Transactions)లకు సంబంధించి ఇంచుమించు అన్ని బ్యాంకుల్లోనూ సర్వర్లు మొరాయించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కోటక్ మహింద్ర వంటి బ్యాంకులు ఇందులో ఉన్నాయి. అయితే ఎందుకు ఇలా జరిగిందో ఇప్పటికైతే ఎవరూ చెప్పలేకపోతున్నారు. UPI సేవలు నిలిచిపోవడంపై యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ట్రాన్జాక్షన్స్ జరుపుదామంటే ‘మనీ వాజ్ నాట్ డెబిటెడ్… యువర్ బ్యాంక్ సర్వర్ ఈజ్ బిజీ… యు కెన్ ట్రై ఎనదర్ పేమెంట్ మెథడ్ ఆర్ ట్రై ఎగైన్ సమ్ టైమ్…’ అన్న జవాబే వస్తున్నట్లు పోస్టుల్లో తెలియజేస్తున్నారు.
Published 06 Feb 2024