బడ్జెట్ సమావేశాల్లో(Budget Sessions) భాగంగా శాసనసభలో అధికార, విపక్షాల మధ్య అగ్గి రాజుకుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై సభ ప్రారంభం కాగానే విపక్షం నుంచి తొలుత కడియం శ్రీహరి మాట్లాడేందుకు స్పీకర్ అనుమతిచ్చారు. సభలో కోరం గురించి మాట్లాడిన శ్రీహరిపై మంత్రి శ్రీధర్ బాబు అసహనం వ్యక్తం చేశారు. 119 మంది సభ్యులకు 12 మంది కోరం ఉందని, ఈ విషయం గమనించాలని మంత్రి క్లారిటీ ఇచ్చారు. అనంతరం బడ్జెట్ బుక్ లెట్ లో ప్రస్తావించిన సూక్తులు(Quotes)పైనా కడియం మాట్లాడటంతో రెండు పార్టీల సభ్యులు విమర్శలు చేసుకున్నారు.
రాజగోపాల్ రెడ్డి కౌంటర్…
మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. శ్రీహరి తీరుపై మండిపడ్డారు. హోంమంత్రి అయ్యేది లేదు.. చేసేది లేదంటూ మొన్నటి సమావేశాల్లో ఇంకా పరుషంగా మాట్లాడిన శ్రీహరి మాటలపై రాజగోపాల్ మండిపడ్డారు. నేను హోంమంత్రి కావడం అధిష్ఠానం చేతుల్లో ఉందని, కానీ కడియం శ్రీహరి మాత్రం ఒక ఉద్యమకారుడైన రాజయ్యను అణగదొక్కి మంత్రి పదవి కోసం కుట్రలు చేశారని విమర్శించారు.
CM సీరియస్…
నల్గొండ సభ ద్వారా కేసీఆర్ మాట్లాడిన తీరు అసభ్యకరమని రేవంత్ విమర్శించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని మేడిగడ్డకు ఏం పీకడానికి వెళ్లారంటూ మాట్లాడతారా.. ఒక సీనియర్ పొలిటీషియన్ గా KCR ఇదేనా పద్ధతి… మొన్నటి ఎన్నికల్లో మీ ప్యాంటు పీకారు ప్రజలు.. నాలుగు కోట్ల మంది ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి గురించి ఇలా మాట్లాడటం తెలంగాణ సంప్రదాయమా.. అని CM ఆగ్రహం చెందారు. సభకు రాకుండా పారిపోయిన వ్యక్తి అసెంబ్లీలో కాకుండా ఎక్కడో మాట్లాడటం.. తమను చంపుతారన్న KCR కామెంట్స్ పై సచ్చిన పామును ఎవరైనా చంపుతారా అధ్యక్షా అంటూ రేవంత్ మాట్లాడారు.