పరీక్ష పేపర్లను బజార్లో పల్లీలు ప్యాక్ చేసేందుకు వాడుకునేలా చేసిన కేసీఆర్.. నువ్వు మనిషివా, మానవ మృగానివా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పొద్దున లేస్తే చెత్త మాటలు, సొల్లు వాగుడు ప్రభుత్వం పడిపోతుందని.. ఈ సర్కారును ఎవరూ ఏం చేయలేరు అంటూ ఆయన కామెంట్ చేశారు. ‘ముఖ్యమంత్రిని, PCC ప్రెసిడెంట్ ను నేనే.. ఛాలెంజ్ విసురుతున్నా.. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిపించు చూడు కేటీఆర్.. అయ్య పేరు చెప్పుకుని కుర్చీలో కూర్చోలోని నిస్సహాయుడివి.. నిటారుగా నిలబడి మీ కుటుంబానికి అడ్డుపడి ప్రజల ద్వారా కుర్చీలో కూర్చున్నాం.. ప్రజలు మమ్మల్ని మోసినంత కాలం ఈ కుర్చీని మీరు తాకలేరంటూ’ రేవంత్ తీవ్రంగా మండిపడ్డారు.
మరింత కఠినంగా…
చేవెళ్ల సభలో మాట్లాడిన రేవంత్… పంట పొలాల్ని దోచుకునే అడవి పందులకు కరెంటు షాక్ ఇచ్చినట్లు.. తెలంగాణను పదేళ్లు దోచుకున్న మీకు ప్రజలు షాకిచ్చారని రేవంత్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. యూట్యూబ్ ఛానల్స్ పెంటుకుంటే బాగుండేదని కేటీఆర్ అనడంపైనా రేవంత్ స్పందించారు. ‘ఆ ట్యూబ్, ఈ ట్యూబ్ ఏది పెట్టుకున్నా చివరకు మీ ట్యూబ్ లైట్లు పగలగొట్టడం ఖాయమని’ అన్నారు.