పరిస్థితులు ఎంత మారిపోయాయో చూడండి.. గంట సేపు కాదు కదా.. నిమిషం సేపైనా సోషల్ మీడియా లేకుండా ఉండలేని స్థితికి వచ్చేశారు జనం. మొన్న UPI సేవలు నిలిచిపోయి గందరగోళం ఏర్పడితే… ఇప్పుడు తాజాగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. సమస్య తలెత్తి రెండున్నర గంటల పాటు ఈ రెండు ప్లాట్ ఫామ్స్ నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తం(Worldwide)గా కోట్లాది మంది యూజర్లు అయోమయంలో పడిపోయారు. ‘అవి లేకపోతే తట్టుకోలేం’ అన్న రీతిలో ‘X’, ‘వాట్సాప్’ వంటి ప్లాట్ ఫామ్స్ లో పోస్టుల మీద పోస్టులు, ఫొటోల మీద ఫొటోల పెట్టి హడావుడి చేశారు. దీన్నిబట్టే తెలుసుకోవచ్చు.. సోషల్ మీడియా తీరు ఎలా తయారైందో.
రెండింటికీ బ్రేక్…
సామాజిక మాధ్యమాల రారాజుగా ముద్రపడ్డ ఫేస్ బుక్(Facebook), ఇన్ స్టాగ్రామ్(Instagram)లు.. ఎంతటి ఫాలోవర్లను కలిగి ఉన్నాయో చెప్పనక్కర్లేదు. మెటా ఆధ్వర్యంలోని ఈ రెండు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో యూజర్లు(Users) అయోమయంలో పడ్డారు. ఎన్నిసార్లు ఓపెన్ చేయాలని చూసినా ‘ప్లీజ్ లాగిన్ అగెయిన్(Please Login Again)’ అన్న మెసేజే స్క్రీన్ పై కనపడింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో పలువురు యూజర్లు ఆ ఫొటోల్ని ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేస్తున్నారు.
రాత్రి నుంచి స్టార్ట్…
ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సర్వీసుల నిలిచిపోవడం ఈ రాత్రి 7:32 గంటలకు ప్రారంభం కాగా.. 9 గంటల కల్లా అది తీవ్రస్థాయి(Peak Stage)కి చేరుకుంది. దీంతో మూడున్నర లక్షల మంది యూజర్లు ఇన్ స్టాగ్రామ్ తో ఇబ్బందులు పడ్డట్లు తెలిపారు. అటు ఫేస్ బుక్ తో సమస్య(Problems) ఎదుర్కొన్నట్లు 3.53 లక్షల మంది ప్రకటించారు. ఇన్ స్టాలో ఇష్యూస్ వస్తున్నాయని 70% మంది తెలియజేస్తే, మిగతా 30% మందికి లాగిన్ సమస్య వచ్చిపడింది. ఇక ఫేస్ బుక్ లోనైతే 75% మందికి లాగిన్ సమస్య ఏర్పడింది. ఈ రెండింటి ద్వారా తమకు ఎదురైన ఇబ్బందుల్ని చాలా మంది యూజర్లు ‘X’లో పోస్ట్ చేశారు.
టెక్నికల్ ఇష్యూయేనా…
ఇలా అకస్మాత్తు(Sudden)గా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడానికి ప్రధాన కారణం సాంకేతిక సమస్య(Technical Issue)గానే భావిస్తున్నారు. అయితే దీనిపై ‘మెటా యాజమాన్యం’ ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. ఆ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ రెండింటి సమస్యలపై కారణాలను పూర్తిస్థాయిలో అంచనా వేయలేమని నిపుణులు అంటున్నారు. అయితే రాత్రి 10 గంటల తర్వాత ‘మెటా’ సంస్థ స్పోక్స్ పర్సన్ ఆండీ స్టోన్ మెసేజ్ ఇచ్చారు. ‘యూజర్ల ఇబ్బందులు చూస్తున్నాం.. వాటిని తిరిగి నిలబెట్టే పనిలో ఉన్నాం’ అంటూ ట్వీట్ చేశారు.