దేశవ్యాప్తంగా మొత్తం 14 మంది ఎంపీ అభ్యర్థుల(Candidature) పేర్లను హస్తం పార్టీ ప్రకటించింది. అందులో తెలంగాణకు చెందినవారు నలుగురు ఉన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భువనగిరి స్థానాలకు అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ హైకమాండ్ వెల్లడించింది. వీటితోపాటు ఉత్తర్ ప్రదేశ్ నుంచి నలుగురు, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ముగ్గురేసి చొప్పున పేర్లను ప్రకటించింది.
నియోజకవర్గం – అభ్యర్థి
ఆదిలాబాద్ – సుగుణ
నిజామాబాద్ – తాటిపర్తి జీవన్ రెడ్డి
మెదక్ – నీలం మధు
భువనగిరి – చామల కిరణ్ కుమార్ రెడ్డి