ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్న ఆయనకు.. పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ ముఖ్యమంత్రే(Chief Minister) పంచుకున్నారు. 50 ఏళ్ల వయసులో పంజాబ్ CM భగవంత్ సింగ్ మాన్ తండ్రి అయ్యారు. 2022లో పంజాబ్ 17వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాన్.. గురుప్రీత్ కౌర్ అనే డాక్టర్ ను వివాహ(Marriage)మాడారు.
‘ఎక్స్’ వేదికగా…
‘దేవుడు నాకు కుమార్తె రూపంలో బహుమతి(Gift) ఇచ్చాడు.. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.. అంటూ సోషల్ మీడియా ‘X’ వేదికగా కూతురు ఫొటోను షేర్ చేసుకున్నారు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ 2022 జూలైలో గురుప్రీత్ కౌర్ ను పెళ్లి చేసుకున్నారు. చీఫ్ మినిస్టర్ గా పగ్గాలు చేపట్టిన నాలుగు నెలలకు రెండో పెళ్లి చేసుకున్నారు.
గతంలోనే పిల్లలు…
కాగా ఈ CMకు గతంలోనే ఇందర్ ప్రీత్ కౌర్ తో వివాహమైంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు 22 ఏళ్ల సీరత్ కౌర్ మాన్, 19 సంవత్సరాల దిల్షాన్ సింగ్ మాన్ ఉండగా.. భగవంత్, ఇందర్ ప్రీత్ మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు.