నీళ్లు, కరెంటు విషయంలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం కేవలం నాలుగు నెలల్లో వెనుకబాటుకు గురైందని, ఇదే కాంగ్రెస్ పాలన(Cong Govt)కు నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి(Former CM) కె.చంద్రశేఖర్ రావు విమర్శించారు. తమ హయాంలో ఎక్కడా నీళ్ల ట్యాంకర్లు, ఇన్వర్టర్లు కనిపించలేదని, కానీ ఈ సర్కారు హయాంలో అవన్నీ కనిపిస్తున్నాయన్నారు. సూర్యాపేట జిల్లాలో రైతుల్ని కలుసుకున్న గులాబీ పార్టీ అధ్యక్షుడు.. అక్కడే మీడియాతో మాట్లాడారు.
అసమర్థ, అవివేక ప్రభుత్వం…
వనరుల్ని(Resources) వాడుకునే తెలివిలేని అసమర్థ ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని KCR అన్నారు. రైతుబంధును 10 లేదా 12 రోజుల్లోనే అందరి అకౌంట్లలో పడేవని, కానీ ఢంబాచారాలు తప్ప కాంగ్రెస్ లీడర్లు రైతులకు డబ్బులు వేయడం లేదని విమర్శలు చేశారు. పవర్ సిస్టమ్ లో IASలను తొలగించి టెక్నోక్రాట్ లను పెట్టినందువల్లే కరెంటు వ్యవస్థ సమర్థంగా నడిచిందని, కానీ కాంగ్రెసోళ్లు IASలను తెచ్చిపెట్టడం వల్ల ఎవరికీ పట్టింపు లేకుండా పోయిందన్నారు.