అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామనే దానిపై క్లారిటీ ఇచ్చింది కాంగ్రెస్(AICC) పార్టీ. వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం తయారు చేసిన మేనిఫెస్టో(Manifesto)ను AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ విడుదల(Release) చేశారు. రాబోయే ఎన్నికల్లో పీఠాన్ని దక్కించుకుంటే చేయబోయే కార్యక్రమాలపై ‘న్యాయ్ పత్ర’ పేరుతో మేనిఫెస్టో రూపొందించారు.
ఆ రెండు సర్వేలు…
‘పాంచ్ న్యాయ్… ఫైవ్ పిల్లర్స్ ఆఫ్ జస్టిస్(Five Pillars Of Justice)’ పేరిట హస్తం పార్టీ మేనిఫెస్టో రిలీజైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక-ఆర్థిక సర్వేతోపాటు కులగణన సర్వే చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. OBC, SC, STల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచుతూ రాజ్యాగం సవరణ చేస్తామని తెలిపింది.
సర్వేలోని అంశాలివే…
దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక సర్వే
కులగణన సర్వే
ఉపాధిహామీ కూలీ రోజుకు రూ.400కు పెంపు
OBC, SC, ST రిజర్వేషన్లు 50% కోసం రాజ్యాంగ సవరణ
ఒకటో తరగతి నుంచి 12వ క్లాస్ దాకా ఉచిత విద్య
యువతకు భారీస్థాయిలో ఉద్యోగాల కల్పన
ప్రశ్నాపత్రాల లీకేజీపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు
పంచాయతీలు, మున్సిపాలిటీలతోపాటు దేశవ్యాప్తంగా 30 లక్షల ఉద్యోగాల భర్తీ
మహాలక్ష్మీ స్కీమ్ కింద ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష అందజేత
కనీస మద్దతు ధర కోసం చట్టం
సామాజిక న్యాయం కింద పింఛను రూ.1,000కి పెంపు
BC, SC, STలకు రిజర్వ్ చేసిన పోస్టులు ఏడాదిలో భర్తీ
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛను పెంపు
BC, SC, ST విద్యార్థులకు స్కాలర్ షిప్ రెట్టింపు(Double)
విద్యార్థులకు రూ. లక్ష ఆర్థిక సాయం
ప్రతి జిల్లాలో లైబ్రరీలతో కూడిన అంబేడ్కర్ భవనాలు
వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడితే కఠిన చర్యలతో చట్టం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్