ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తున్నామని కాంగ్రెస్ అగ్రనేత(Top Leader) రాహుల్ గాంధీ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 50 వేల ఉద్యోగాలను కల్పించబోతున్నామని తుక్కుగూడ(Tukkuguda) సభా వేదికగా ప్రకటించారు. ఇప్పటికే రూ.500 సిలిండర్, మహాలక్ష్మీ వంటి పథకాల్ని అందుబాటులోకి తీసుకువచ్చామని, మిగతా హామీల్ని సైతం నెరవేర్చబోతున్నామని గుర్తు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ లు…
గత ముఖ్యమంత్రి ఎలా పనిచేశారో మీరందరూ చూశారు.. వేలాది మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి, బెదిరించి బలవంతపెట్టి డబ్బు వసూలు చేశారు.. దేశంలోని అవినీతిపరులంతా మోదీ ఎదుట నిల్చున్నారు.. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఎంతటి ఫ్రాడ్(Fraud) జరిగిందో అందరికీ తెలిసింది.. మోదీ వచ్చే ముందే ఈడీ వచ్చేస్తుంది.. అంటూ రాహుల్ విమర్శలు చేశారు.