మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ మధ్య ప్రజల మధ్యలోకి వెళ్లి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని CM రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. KCRకు చర్లపల్లి జైలులో చిప్పకూడు తప్పదని, డబుల్ బెడ్ రూముల పేరిట ప్రజల్ని మోసం చేసిన ఆయనకు అదే కారాగారంలో రెండు పడక గదుల ఇల్లు(Double Bed Room) కట్టిస్తానని అన్నారు.
పదేళ్లు దోచుకుని…
KCR తన పదేళ్ల పాలనా కాలంలో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ దోచుకున్నారన్న రేవంత్.. మాజీ CMకు కాలు విరిగిందని, కూతురు జైలుకెళ్లిందని జాలి చూపించాం కానీ తమపైనే కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే వదిలిపెట్టబోమంటూ తీవ్రంగా హెచ్చరించారు.