కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదని, ఎవరు ఎప్పుడు BJPలో చేరతారో తెలియని పరిస్థితి ఉందంటూనే చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జంప్ అయినా ఆశ్చర్యం లేదని మాజీ ముఖ్యమంత్రి KCR అన్నారు. కాంగ్రెస్ గెలుపుపై మాకు ఓర్వలేనితనం లేదని, ఐదేళ్లు చూస్తేనే ఎవరి పాలన ఏంటో అర్థమవుతుందని సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ సభలో అన్నారు.
CMకు భయం…
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సభల్లోనే భయపడుతున్నారని, ఆయన ఢిల్లీలో ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారని చంద్రశేఖర్ రావు విమర్శించారు. మళ్లీ BRSను అధికారంలోకి తెచ్చి రాష్ట్రాన్ని కాపాడతానన్నారు. తెలంగాణలో రైతులు తిరగబడే పరిస్థితి వచ్చేసిందని, లోక్ సభ ఎన్నికల్లో BJPకి ఓటేసినా, నీళ్లల్లో వేసినా ఒకటేనని కేసీఆర్ విమర్శలు చేశారు.