నోటిఫికేషన్ వెలువడ్డ రెండో రోజు(Second Day) అయిన ఇవాళ పెద్దయెత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 57 మంది రిటర్నింగ్ కార్యాలయాల్లో 69 సెట్ల పేపర్లు అందజేశారు. అత్యధికంగా సికింద్రాబాద్, నిజామాబాద్ నియోజకవర్గానికి 6 చొప్పున… అత్యల్పంగా నాగర్ కర్నూల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాలకు ఒక్కొక్కటి వచ్చింది. అన్ని ప్రధాన పార్టీల నుంచి ఈరోజు నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న, ఇవాళ కలిపి మొత్తంగా 98 మంది అభ్యర్థులు(Candidates) 117 నామినేషన్లు వేశారు.
నియోజకవర్గం నామినేషన్లు
సికింద్రాబాద్ 6
నిజామాబాద్ 6
మహబూబ్ నగర్ 5
భువనగిరి 5
మల్కాజిగిరి 5
నల్గొండ 4
మహబూబాబాద్ 4
మెదక్ 4
వరంగల్ 3
పెద్దపల్లి 3
జహీరాబాద్ 3
చేవెళ్ల 3
నాగర్ కర్నూల్ 1
ఖమ్మం 1
కరీంనగర్ 1
ఆదిలాబాద్ 1