రైతు రుణమాఫీ(Loan Waive)పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలపై విపక్షాలు(Opposition Parties) విమర్శలు చేస్తూనే ఉన్నాయి. నాడు, నేడు ఆయన చెప్పిన మాటల్ని సోషల్ మీడియా(Social Media) ద్వారా ప్రచారం చేస్తూ పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లడుగుతున్నాయి. ఇప్పుడు అదే రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు CM రేవంత్ సైతం ఇచ్చిన మాటపై మరోసారి స్పష్టతనిచ్చారు.
ఏడుపాయల సాక్షిగా…
అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను గెలిపించేందుకు రేవంత్ మెదక్ ప్రజల ఎదుట మాట్లాడారు. ఏడుపాయల వనదుర్గామాత సాక్షిగా ఈ ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామన్నారు. మెదక్ చర్చి సాక్షిగానూ రుణమాఫీ ఉంటుందని నొక్కి చెప్పారు. వచ్చే వరి పంటకు సైతం రూ.500 బోనస్ ఇస్తామన్నారు. వచ్చే పదేళ్లు ఇక్కడే ఉంటాం, ఎవరొస్తారో రండి అంటూ ఛాలెంజ్ చేశారు.