ఆమె మొన్నటివరకు మన రాష్ట్రానికి గవర్నర్(Governor). బాధ్యతల్లో తనదైన ముద్ర వేస్తూ అప్పటి అధికార పార్టీని ముప్పుతిప్పుల పెట్టిన మనస్తత్వం ఆమెది. ప్రభుత్వం పంపిన బిల్లుల(Bills)పై సందేహాలు వ్యక్తం చేస్తూ కొన్నింటిని నిలిపివేస్తూ సాగింది గవర్నర్ పదవి. అందుకే ఆమెను పక్కా BJP లీడర్ అంటూ విమర్శలు చేసేవారు మాజీ CM కేసీఆర్ BRS నేతలు. అలా మొన్నటిదాకా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆమే ఇప్పుడు.. నిజంగానే కమలం పార్టీ కోసం ప్రచారకర్త(Campaigner) అవతారమెతారు.
BRS నాయకుల మాటల్ని నిజం చేస్తూ మాజీ గవర్నర్ తమిళిసై.. రాజకీయ పార్టీ నేతగా తెలంగాణలో అడుగుపెడుతున్నారు. ఇవాళ్టి నుంచి ఆమె BJP అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆ పార్టీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. చెన్నై సౌత్(Chennai South) నుంచి MPగా బరిలోకి దిగిన తమిళిసై సౌందరరాజన్.. ఇప్పుడు మన రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారకర్తగా కొత్త పాత్రకు దిగుతున్నారు.