ఆధార్ కార్డును ఉచితం(Free)గా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం మరోసారి గడువు పొడిగించింది. ప్రజల వినతుల్ని పరిగణలోకి తీసుకున్న భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI).. ఇందుకోసం సెప్టెంబరు 14 వరకు గడువు పొడిగించింది. ఈ 12 డిజిట్స్ నంబరు అప్టేడ్ టైమ్ ఇప్పటివరకు ఈ జూన్ 14 దాకా ఉంది.
ఇది ఐదోసారి…
ఉడాయ్ మొదట 2023 మార్చి 15 వరకు తొలిసారి, ఆ తర్వాత రెండోసారి 2023 డిసెంబరు 14 దాకా గడువిచ్చింది. మళ్లీ 2024 మార్చి వరకు మూడోసారి… ఇక నాలుగోసారి ప్రస్తుత గడువు జూన్ 14 దాకా అవకాశమిచ్చింది. ప్రజల నుంచి స్పందన(Response) బాగా ఉండటం వల్లే గడువును మరో మూణ్నెల్ల(3 Months) పాటు పొడిగించినట్లు ఉడాయ్ తెలిపింది.
ఆధార్ తీసుకుని పదేళ్లు దాటినవారు అప్డేట్ చేసుకోవాలి. ఇందుకోసం ఉడాయ్ వెబ్ సైట్లోకి లాగిన్ అయి ఐడెంటిటీ కార్డు, అడ్రస్ ను సబ్మిట్(Submit) చేయాలి. ధ్రువీకరణకు రేషన్ కార్డు, ఓటర్ ID వంటివి అవసరమవుతాయి.