రాష్ట్రపతి, గవర్నర్లపై దాఖలయ్యే కేసుల్లో రాజ్యాంగబద్ధ మినహాయింపుపై సుప్రీంకోర్టు పరిశీలన చేపట్టింది. క్రిమినల్ ప్రొసీడింగ్స్(Proceedings) నుంచి వారికి మినహాయింపు దక్కే పరిధిపై న్యాయ సమీక్షకు అంగీకరించింది. నేర విచారణ నుంచి మినహాయింపు కల్పించే ఆర్టికల్ 361 రాజ్యాంగ నిబంధనను పరిశీలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పశ్చిమబెంగాల్ గవర్నర్ CV ఆనందబోస్ తనను లైంగికంగా వేధించారంటూ రాజ్ భవన్లో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళ.. అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై సదరు మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూ 361 అధికరణ(Article)పై సమీక్ష చేయాలని కోరారు.
ఈ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న CJI డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. తమ స్పందన తెలపాలంటూ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రపతి, గవర్నర్లు విధులను నిర్వర్తించే విషయంలో ఏ కోర్టుకూ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేకుండా ఆర్టికల్ 361 రక్షణ కల్పిస్తుంది.