దేశంలో సివిల్ సర్వెంట్లను అందించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)కు ఛైర్మన్ అయిన మనోజ్ సోని రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం 2029 వరకు ఉన్నా వ్యక్తిగత(Individual) కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సోని రాజీనామాను ఇంకా కేంద్రం ఆమోదించలేదు.
ఈ మధ్యకాలంలో UPSCపై పలు రకాల ఊహాగానాలు వస్తున్నాయి. కొందరు అభ్యర్థులు తప్పుడు(Fake) సర్టిఫికెట్లు సమర్పించి UPSC ఉద్యోగాలు సాధించారన్న విమర్శలు పెద్దయెత్తున ఉన్నాయి. ఇలాంటి సమయంలో మనోజ్ సోని రాజీనామా చేయడం సంచలనంగా నిలిచింది.
నీట్ యూజీ-2024 పరీక్షలు లీకయ్యాయన్న ఆరోపణలపై వాటిని నిర్వహించిన NTA(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) డైరెక్టర్ జనరల్(DG) సుబోధ్ కుమార్ సింగ్ ను కేంద్రం తొలగించింది. ఈ సమస్య సద్దుమణగకముందే ఇప్పుడు UPSC ఛైర్మన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇందుకు కారణాలేంటి అనేది తెలియాల్సి ఉంది.