BJP మేనిఫెస్టోలోని కీలకమైన ఉమ్మడి పౌరస్మృతి(Uniform Civil Code)పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 22వ లా కమిషన్ గడువు ఆగస్టు 31తో ముగియడంతో కొత్త కమిషన్ కు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ముసాయిదాను సిద్ధం చేయడంతోపాటు వివిధ అంశాలను పరిశీలించి సూచనలు చేసే బాధ్యతల్ని 23వ లా కమిషన్ చూస్తుంది.
మూడేళ్ల కాల వ్యవధి గల కమిషన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఛైర్మన్ గా, నలుగురు హైకోర్టు జడ్జిలు నియామకమవుతారు. ఇక మెంబర్ సెక్రటరీ, ఎక్స్-అఫీషియో సభ్యులుగా రిటైర్డ్ న్యాయమూర్తులు, నిపుణులు ఉంటారు. UCCని అమల్లోకి తెచ్చే దిశగా గత లా కమిషన్ దేశవ్యాప్త సంప్రదింపులు జరిపింది. UCCపై మొన్నటి స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని మాట్లాడిన తర్వాత ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది.