పశ్చిమబెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలిసారి భావోద్వేగం(Emotional)గా మాట్లాడారు. తనకు పదవిపై మోజు లేదని, అందరూ కోరితే రాజీనామాకు సిద్ధమంటూ జూనియర్ డాక్టర్లతో జరిగిన భేటీలో అన్నారు. కొందరు స్వార్థపరుల వల్లే నిరసనలు ఉంటున్నాయని, తమ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా అవమానిస్తున్నారని విమర్శించారు.
‘రాజకీయ రంగు పులుముకున్న వ్యక్తులకు న్యాయం అవసరం లేదు, వారికి కుర్చీయే కావాలి.. నాకు CM పదవి వద్దు, బాధితురాలికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా..’ అని మమత ఆశ్చర్యకరంగా మాట్లాడారు. తమ డిమాండ్లలో ఒక అంశాన్ని తిరస్కరించడంతో మమతతో డాక్టర్ల భేటీకి రెండు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది.