పశ్చిమబెంగాల్లో ప్రభుత్వానికి, గవర్నర్ కు దూరం మరింత పెరిగింది. ట్రెయినీ డాక్టర్ రేప్, మర్డర్ కేసు విషయంలో TMC సర్కారు తీరుపై గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ మండిపడ్డారు. CM మమతను బహిష్కరిస్తున్నానని, నేను ఎప్పుడూ ఆమెతో వేదిక పంచుకోనంటూ మాట్లాడారు. ఆమెను ఓ మంత్రగత్తెగా పోల్చుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
బెంగాల్లో నగరాలు, పట్టణాలు, గ్రామాలు చివరకు ఆసుపత్రుల్లోనూ హింసే ఉందని.. నిబంధనలు ఉల్లఘించినందుకు ఆమెపై చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. ఆరోగ్య మంత్రి, హోం మంత్రి అన్నీ మమతా బెనర్జీయే.. ఇటువంటి పోర్ట్ ఫోలియోలను చూస్తూ ఆమె ఎలా ఉన్నారో చూడండి.. అంటూ విమర్శలు చేశారు. కోల్ కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ పై చర్యలు తీసుకోవాలన్న గవర్నర్ సలహాను అక్కడి సర్కారు పట్టించుకోలేదు. మెడికల్ కాలేజీలో హత్యాచారం కేసును సరిగా విచారించని CPపై చర్యలు తీసుకోకపోవడం ఆయనకు కోపాన్ని తెప్పించింది.