ఛైల్డ్ పోర్నోగ్రఫీ(పిల్లల అసభ్య వీడియోలు) చూడటం, డౌన్ లోన్(Download) చేయడం నేరమేనని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదంటూ జనవరి 11న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. చీఫ్ జస్టిస్(CJI) డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిసి జె.బి.పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనం విస్పష్ట తీర్పునిచ్చింది.
వీక్షించినా, డౌన్లోడ్ చేసినా పోక్సో, IT చట్టాల కింద శిక్షించాల్సి ఉంటుందని సుప్రీం బెంచ్ వెల్లడించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం తప్పేమీ కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు దారుణమంటూ సుప్రీం గతంలోనే అభిప్రాయపడింది. పోక్సో సవరణ చేపట్టాలని మేం పార్లమెంటుకు సూచించాం.. కాబట్టి చిన్నపిల్లల్లి లైంగికంగా వేధించే అంశంపై ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పాం అని బెంచ్ క్లారిటీ ఇచ్చింది.