జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు, BRS నేత మాగంటి గోపినాథ్(63) పరిస్థితి సీరియస్ గా ఉంది. డయాలసిస్ కు తోడు గుండె సమస్యతో బాధపడుతున్న ఆయన్ను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఆస్పత్రికి తరలించారు. ఆయన వెంటిలేటర్ పై ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో 1983లో అడుగుపెట్టారు. ఆ తర్వాత BRSలో చేరి వరుసగా రెండుసార్లు MLAగా గెలుపొందారు. 2014లో తొలిసారి TDP నుంచి గెలిచాక.. ఆ తర్వాత BRSలో చేరి 2018, 2023 ఎన్నికల్లో విజయాలు సాధించారు.