కొత్త మంత్రుల(New Ministers) ప్రమాణస్వీకారంతో రాష్ట్ర మంత్రివర్గం(Cabinet)లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. కొత్తవారికి శాఖల కేటాయింపు, ఇప్పటికే ఖాళీగా ఉన్నవాటి గురించి AICC పెద్దల్ని CM రేవంత్ కలుస్తున్నారు. SCల నుంచి ఇద్దరు, BCల నుంచి ఒకరు బాధ్యతలు చేపట్టగా.. ఈ ముగ్గురికి శాఖలు కేటాయించాలి. రేవంత్ వద్ద హోం, మున్సిపల్, విద్య, సంక్షేమ శాఖలు ఉన్నాయి. కొందరిని మార్చుతారా, లేదా కొత్త మంత్రులకే మిగిలిన శాఖలు ఇస్తారా అన్న విషయంలో సందిగ్ధతకు తెరపడాల్సి ఉంది. భట్టి వద్ద ఆర్థికం, విద్యుత్తు.. ఉత్తమ్ వద్ద నీటిపారుదల, పౌరసరఫరాలు.. శ్రీధర్ బాబు వద్ద IT, శాసనసభ వ్యవహారాల శాఖలు ఉన్నాయి.