బనకచర్ల ప్రాజెక్టు ఏ బేసిన్లో(Basin) ఉందో కూడా తెలియని రేవంత్.. రాష్ట్రాన్ని పాలించే CMగా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆయనకు విషయం తక్కువ, విషం ఎక్కువ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై ఆధారపడే అలవాటు ఇంకా పోలేదన్నారు. నల్లమల ఏ రాష్ట్రంలోకి వస్తుందని అధికారుల్ని అడగడం చూస్తేనే.. ఆయన నల్లమల నుంచి వచ్చారా అన్న డౌట్ కలుగుతుందని హరీశ్ విమర్శలు చేశారు.