బంగారం ధర ఒక్కరోజే ఇంచుమించి వెయ్యి రూపాయలు తగ్గింది. ప్రపంచ మార్కెట్లో పుత్తడి, వెండి ధరలు దిగిరావడంతో దేశవ్యాప్తంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ పెరగడంతో డిమాండ్ తగ్గింది. ఫెడరల్ రిజర్వ్ పాలసీ, దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులు కూడా తగ్గుదలకు కారణమయ్యాయి. 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.97,500, 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.89,300గా ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ భయాలు తొలగడం, భారత్-అమెరికా, చైనా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలతో గత ఆరు రోజుల్లో రూ.3,000 మేరకు రేట్లు దిగివచ్చాయి. https://justpostnews.com