
యుద్ధ ప్రభావంతో వంట నూనెల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మొన్నటిదాకా లీటర్ కు రూ.152-155 ఉంటే ఇప్పుడది రూ.170-180కి చేరుకుంది. ఆన్లైన్లో సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.175-180, దుకాణాల్లో రూ.170-173 వరకు అమ్ముతున్నారు. పామాయిల్ సైతం రూ.10-20 పెరిగింది. మార్చిలోనే ఒక్కో రకానికి రూ.11 నుంచి 20 దాకా ఎక్కువైంది.
సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు 2026లో 50% తగ్గాయి. గతంలో ఉక్రెయిన్ నుంచే 70-80% వచ్చేవి. కానీ రష్యా యుద్ధం ప్రారంభించడంతో ఉక్రెయిన్ నుంచి సరఫరా ఆగిపోయింది. ఇతర దేశాల మీద ఆధారపడ్డా, ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మళ్లీ ప్రభావం చూపించింది.