
కోర్టులో జరిగేవి అందరికీ తెలుస్తుంటాయని కానీ న్యాయస్థానం గదుల వెనుక మరో ప్రపంచం ఉంటుందని సుప్రీం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. మేం కేసుల విషయంలో ఇంటిలోనూ నిరంతరం పనిచేస్తూనే ఉంటామన్నారు. తెలంగాణ హైకోర్టు జోన్-2 భవన నిర్మాణాల శంకుస్థాపనకు ఆయన హాజరయ్యారు. ప్రతి రాష్ట్రానికి హైకోర్టు కీలకమని, అలాంటి న్యాయస్థానానికి భవనాలు నిర్మించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపుతోందని సీజేఐ ప్రశంసించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువులు సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు హాజరయ్యారు. జడ్జిలు సమాజంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా వేడుకలకు వెళ్లాలన్నా ఆలోచించాల్సిందే.