
ఆ సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పెద్దయి కూతురు హీరోయిన్ అయింది. ఉన్నట్టుండి ఆ జంట విడాకులు తీసుకుంది. తిరిగి పదేళ్లకు మళ్లీ కలిసిన ఆ జోడీయే మలయాళ డైరెక్టర్ ప్రియదర్శన్, ఆయన భార్య లిజి. ’20వ శతాబ్దం’, ‘ఆత్మబంధం’, ‘స్టూవర్టుపురం దొంగలు’ వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది లిజి. 1990 డిసెంబరు 13న పెళ్లి చేసుకున్నాక తన పేరును లక్ష్మీగా మార్చుకుంది. సినిమాలకు సైతం గుడ్ బై చెప్పింది లిజి. కానీ ఉన్నట్టుండి 2016లో విడిపోయారు. అదో పెద్ద కారణమా అంటే అదీ కాదు.. కేవలం ఈగోల వల్లేనట. అప్పట్నుంచి విడిగానే ఉంటున్న వీరు ఇప్పుడు కలిసిపోయారు. ప్రస్తుతానికి కలిసి ఉంటున్నా మళ్లీ పెళ్లి చేసుకోలేదంటున్నారు ప్రియదర్శన్.