
శత్రు ప్రాంతంలో చిక్కుకున్న తమ యుద్ధ పైలట్ ను అమెరికా అసాధారణ రీతిలో కాపాడుకుంది. F-15 స్ట్రైక్ ఈగల్ జెట్ కూలి ఒకరు మిస్సయ్యారు. అతణ్ని రక్షించుకోవాలని అమెరికా, మట్టుబెట్టాలని ఇరాన్ కాచుక్కూచ్చున్నాయి. పైలట్ నుంచి సిగ్నల్ అందుకోగానే అప్రమత్తమైన రక్షణ శాఖ.. ప్రత్యేక ఉపగ్రహాలు, డ్రోన్లు, నైట్ విజన్ పరికరాల్ని ఉపయోగించింది. ఇందుకు HH-60W జాలీ గ్రీన్ రెస్క్యూ హెలికాప్టర్లు, ఎ-10 అటాక్ జెట్స్, HC-130 రెస్క్యూ మిడ్-ఎయిర్ ట్యాంకర్ తోపాటు సుదూర పరిధిలో నిఘా పెట్టే ఎఫ్-35 స్టెల్త్ జెట్లతో ప్రత్యేక దళాలు రంగంలోకి దిగాయి. ఒకవైపు ఇరాన్ కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉంటే, అగ్రరాజ్య సైనికులు మాత్రం సాహసోపేతంగా చొచ్చుకెళ్లి అతణ్ని కాపాడారు.