
కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త పథకం తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక్క రూపాయికే సిమ్ కార్డుతోపాటు మొదటి రీఛార్జ్ ను ఉచితంగా అందిస్తోంది. రూ.1తో సిమ్ తీసుకుంటే 24 రోజుల పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లతోపాటు 1 జీబీ డేటా పొందవచ్చు. ఇది కేవలం కొత్త యూజర్స్ కు మాత్రమేనని, సెప్టెంబరు 12 లోపు సిమ్ కొనేవారికి మాత్రమే వర్తిస్తుందంటూ గడువు విధించింది.
రూ.2,399 వార్షిక ప్లాన్ 365 రోజులు ఉంటుండగా, ఈ సెప్టెంబరు 12 లోపు రీఛార్జ్ చేసుకునేవారికి అదనంగా 47 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే మొత్తం వ్యాలిడిటీ 412 రోజులవుతుండగా దాదాపు 13 నెలల కంటే ఎక్కువ. కొత్త కనెక్షన్ తీసుకోవాలంటే మీ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ సెంటర్ లేదా అధీకృత రిటైలర్లను సంప్రదించవచ్చు.