
భారత క్రికెట్ శిఖరం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరిగ్గా ఇదే రోజు తొలి సెంచరీ చేశాడు. 1990 ఆగస్టు 14న ఇంగ్లండ్ లోని మాంచెస్టర్(ఓల్డ్ ట్రాఫోర్డ్) మైదానంలో 17 ఏళ్ల 112 రోజుల వయసులోనే టెస్ట్ సెంచరీ సాధించాడు. ఈ అద్భుత అజేయ శతకం(119*)తో ఓటమిని భారత్ తప్పించుకుని డ్రా చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్వీట్ చేసింది. వన్డేల్లో టెండూల్కర్ తొలి సెంచరీ(110) మాత్రం 1994 సెప్టెంబరు 9న కొలంబోలో ఆస్ట్రేలియాపై పూర్తి చేశాడు.
కెరీర్లో అతడు తన 15వ టెస్ట్ మ్యాచులో, 79వ వన్డేలో తొలి శతకాల్ని నమోదు చేయగా.. అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 100 సెంచరీలు బాదిన ప్రపంచ ఏకైక క్రికెటర్ అతడే. 200 టెస్టుల్లో 49 సెంచరీలు, 463 వన్డేల్లో 51 శతకాలు పూర్తి చేసుకోగా, అప్పటికి టీ20 పెద్దగా ఆదరణ పొందకపోవడంతో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.