
ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. పాత, అనాదిగా వస్తున్న విద్యా విధానానికి చమరగీతం పాడుతూ నూతన అంశాల్ని పొందుపరిచింది. కొత్తగా ప్రకటించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చరిత్ర సిలబస్ నుంచి ఢిల్లీ సుల్తానేట్ పేపరును పూర్తిగా తొలగించింది. “ది ఢిల్లీ సుల్తానేట్; మధ్యయుగ భారతంలో నిర్మాణాలతో అధికారం..” అన్న పేపరును తీసేసింది. మొత్తం 38 డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్(డీఎస్ఈ) పేపర్లపై ప్రతిపాదనలు వస్తే, అందులో 16 అంశాలు మాత్రమే యూనివర్సిటీ చరిత్ర విభాగం ఆమోదం పొంది సెమిస్టర్ లో ముద్రితమయ్యాయి.