
దేవదత్ పడిక్కల్(131 బ్యాటింగ్) సెంచరీకి తోడు కేఎల్ రాహుల్(77 రిటైర్డ్ హర్ట్) జోరైన ఆటతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. లంక గడ్డపై తొలి టెస్టులో జైస్వాల్(32), గిల్(16) తొందరగానే ఔటైనా పడిక్కల్-రాహుల్ జోడీ నిలకడతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 288/2తో ఉంది. కండరాలు పట్టేసి రాహుల్ వెళ్లిపోయాక పంత్(27 బ్యాటింగ్) పడిక్కల్ కు అండగా నిలబడ్డాడు. 239/2తో ఉన్నప్పుడు మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. ఇలా వర్షం రావడం ఈరోజు ఇది రెండోసారి కాగా, 17 ఓవర్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఆట చివర్లో పంత్ వన్డే తరహాలో ఆడి 3 బౌండరీలు, సిక్సుతో వేగంగా పరుగులు సాధించాడు.