
ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు(73) అనారోగ్యంతో కన్నుమూశారు. 1976లో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అంతులేని కథ’తో సినిమాల్లోకి వచ్చి తొలి చిత్రానికే సహాయ నటుడిగా నంది అవార్డు గెలుచుకున్నారు. ‘ముత్యాల పల్లకి’, ‘చట్టానికి కళ్లు లేవు’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ వంటి విజయవంతమైన చిత్రాలతోపాటు పలు సీరియళ్లలో నటించారు. 40 సినిమాల్లో పాత్రలు పోషించిన నారాయణరావు.. ‘దేవాంతకుడు(1984)’, ‘యముడికి మొగుడు(1988)’ చిత్రాలకు నిర్మాత. అత్యధికంగా చిరంజీవి సినిమాల్లోనే నటించిన నారాయణరావుతో చిరు, రజనీకాంత్ కు మంచి మిత్రుత్వం ఉంది.