
వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్ చూపించాడు. బెంగళూరులో జరుగుతున్న దులీప్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో సెంట్రల్ జోన్ పై విరుచుకుపడ్డాడు. ఇషాన్ కిషన్ స్థానంలో మొదటిరోజున తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించిన అతి చిన్న వయసులో సారథి అయ్యాడు వైభవ్. ఇక సెంట్రల్ జోన్ నిన్న 266కు ఆలౌట్ కాగా, తర్వాత సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్(55 బ్యాటింగ్) దూకుడుతో ఈస్ట్ జోన్ 161 పరుగుల వరకు ఒక్క వికెట్ కోల్పోలేదు.
వైభవ్(92; 81 బంతుల్లో 7×4, 7×6) విరుచుకుపడ్డా చివరకు సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. కానీ వైభవ్ ఔటైన వెంటనే ఈస్ట్ జోన్ కుమార్ కుషాగ్ర(0) రూపంలో రెండో వికెట్ కూడా చేజార్చుకుంది. ప్రత్యర్థిని అందుకోవాలంటే ప్రస్తుతానికి ఇంకో 97 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 8 వికెట్లున్నాయి.