
భారతదేశ నంబర్-1 అభిమాన కథానాయికగా రష్మిక మందన్న నిలిచింది. కొన్నేళ్లుగా ఆ పొజిషన్లో ఉన్న దీపిక పదుకొణెను వెనక్కు నెట్టి ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ ర్యాంకింగ్ లో టాప్ లో నిలిచింది. ‘పుష్ప-ది రైజ్’లో శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా పేరు మార్మోగితే, ‘ఛావా’, ‘కుబేరా’ చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. ‘మిషన్ మజ్ను’, ‘సికిందర్’, ‘కాక్ టెయిల్2’ అలరించకపోయినా ఆమె అందం, అభినయం యూత్ ను ఆకట్టుకున్నాయి.