
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలన ఘటన జరిగింది. గత కొంతకాలంగా తీవ్ర వివాదాలకు కారణమైన డ్యాన్సర్ అసోసియేషన్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతేడాది డిసెంబరులో డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన జానీ మాస్టర్ భార్య సుమలతకు షాక్ తగిలింది. ఈ డిసెంబరు వరకు పదవీకాలమున్నా ఆమెను పక్కనపెట్టి కొత్త ప్రెసిడెంటుగా రఘు మాస్టర్ ను నియమించారు.
శేఖర్ మాస్టర్ తో వివాదం, ఇతర డ్యాన్సర్లతోనూ పొసగకపోవడంతో సుమలత వివాదాస్పదురాలిగా నిలిచింది. ఇలా వరుసగా జరుగుతున్న వివాదాలతో ఆమెను తొలగిస్తూ డ్యాన్సర్స్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రఘును తాత్కాలిక అధ్యక్షుడి చేస్తూ త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది.