
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై తీవ్ర పదజాలం వాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరి ఇళ్లకు పొద్దున్నే పెద్దసంఖ్యలో చేరుకుని అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. స్పీకర్ తల్లిని లక్ష్యంగా చేసుకుంటూ దుర్భాషలాడారని నిన్న సీఎం రేవంత్ తోపాటు మంత్రి సీతక్క శాసనసభలోనే ప్రకటించడంతో ఈ అంశం రెండు పార్టీల మధ్య తీవ్ర వివాదం రేపింది.
ఆ ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా, బీఆర్ఎస్ కార్యకర్తల నిరసనల నడుమ ఇద్దర్నీ పోలీస్ స్టేషన్లకు తరలించారు. స్పీకర్ ఓఎస్డీ ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.